Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఒక్క అవకాశం ఇవ్వండి..డివిజన్ అభివృద్ధికి తోడ్పడండి

ఒక్క అవకాశం ఇవ్వండి..డివిజన్ అభివృద్ధికి తోడ్పడండి

- Advertisement -

– కాంగ్రెస్ 7వ డివిజన్ అభ్యర్థి రామర్తి గోపి ప్రచారం
నవతెలంగాణ-నిజామాబాద్
: డివిజన్ కొన్ని సంవత్సరాలుగా వెనుకబాటుకు గురైందని అభివృద్ధి చేసేవారు లేక అనేక సమస్యలకు 7వ డివిజన్ చిరునామాగా మారిందని ఒక్కసారి తనకు అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపుతానని కాంగ్రెస్ పార్టీ 7వ డివిజన్ అభ్యర్థి రామర్తి గోపి అన్నారు. స్థానిక వివేకానంద నగర్ కాలనీలోని ఎస్.ఆర్.ఎమ్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన 7వ డివిజన్ కు చెందిన మహిళల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ అభ్యర్థి రామర్తి గోపి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు గుజ్జ రాజేశ్వరి గారితో కలిసి పాల్గొని మాట్లాడారు. రామర్తి గోపి మాట్లాడుతూ డివిషన్లో సరైన రోడ్లు, ఓపెన్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి దీపాలు లేకపోవడం, పారిశుద్ధ కార్మికుల కొరత, వీధి కుక్కల బెడద, దోమల బెడద, డివిజన్ లో రేషన్ షాప్ లేకపోవడం , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (బస్తీ దవాఖాన ) లేకపోవడం లాంటి అనేక సమస్యలు డివిజన్ ప్రజలను వేధిస్తున్నాయని ఇవన్నీ ఐదు సంవత్సరాల కాలంలో ఏర్పాటు కావాలంటే అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే సాధ్యమవుతుందని అన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న నన్ను చేతి గుర్తుపై అమూల్యమైన ఓటును వేసి 7వ డివిజన్ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -