Friday, May 9, 2025
Homeరాష్ట్రీయంఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రాధాన్యతనివ్వండి

ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రాధాన్యతనివ్వండి

- Advertisement -

– మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఐటీడీఏల పరిధిలో చాలామంది ఇంకా పాకల్లోనే నివసిస్తున్నారనీ, వారికి మొదటి ప్రాధాన్యతలో ఇండ్లను మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ(సీతక్క) ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఐటీడీఏ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. అందులో గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతిబుద్ధ ప్రకాష్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డీ వీసీ.గౌతమ్‌, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ. శరత్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ సర్వేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సూచన మేరకు ఐటీడీఏ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ విధివిధానాలపై చర్చించారు. అధికారులకు మంత్రి సీతక్క పలు కీలక సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని జిల్లాల్లో కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారనీ, ఐటీడీఏ పరిధిలో ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్లకు అప్పజెప్పాలని సూచించారు. ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఐటీడీఏ పీవోలకు పంపి అర్హులను గుర్తించాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -