నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చైనా మీడియా సంస్థల ఎక్స్ ఖాతాలను భారత్ నిలిపివేసింది. చట్టపరమైన అభ్యర్థన మేరకు గ్లోబల్ టైమ్స్, జిన్హువా ఎక్స్ ఖాతాలు నిలిపివేయబడ్డాయని చైనా మీడియా బుధవారం పేర్కొంది. ఈ అంశంపై వివరణ కోరగా ఎలక్ట్రానిక్స్ ఐటి మంత్రిత్వ శాఖ స్పందించలేదు. గ్లోబల్ టైమ్స్, జిన్హువా న్యూస్ ఎక్స్ ఖాతాలను తెరిచినపుడు ”ఖాతా నిలిపివేయబడింది” అనే మెసేజ్ స్క్రీన్‌పై కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 8,000కు పైగా ఖాతాలను నిలిపివేయాల్సిందిగా ఎక్స్ సంస్థకు 2025 మే 8న భారత ప్రభుత్వం ఉత్తర్వులు పంపిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వార్తా సంస్థలు, ప్రముఖ ఎక్స్ వినియోగదారుల ఖాతాలకు భారత్‌లో అనుమతిని నిరోధించాలనే డిమాండ్ ఈ ఉత్తర్వుల్లో ఉంది. మే 7న పాకిస్తాన్ సైన్యం భారత యుద్ధ విమానాన్ని కూల్చివేసిందని చైనా మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ నివేదించిందని చైనాలోని భారత రాయబార కార్యాలయం ఆరోపించింది.
గ్లోబల్ టైమ్స్, జిన్హువా ఎక్స్ ఖాతాలు భారత్‌లో నిలిపివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES