Saturday, January 31, 2026
E-PAPER
Homeజాతీయందిగొచ్చిన‌ బంగారం, వెండి ధ‌ర‌లు

దిగొచ్చిన‌ బంగారం, వెండి ధ‌ర‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప‌లు రోజులు నుంచి బంగారం, వెండి ధ‌ర‌లు కొండెక్కిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా భారీగా పెరుగుతున్న ధ‌ర‌లకు బ్రేక్ ప‌డింది. గ్లోబల్ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావంతో బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఒక్కరోజులోనే తులం బంగారం ధర రూ.19,750 మేర తగ్గి పెట్టుబడిదారులకు షాక్ ఇచ్చింది. కాగా, ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,653గా కొనసాగుతోంది.

అలాగే ఒక్కరోజులోనే కిలో వెండి ధర రూ.1,07,971 మేర తగ్గిపోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,91,922గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు సుమారు 34 శాతం మేర క్షీణించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ స్థాయిలో బంగారం, వెండి ధ‌ర‌లు దిగిరావ‌డంతో గోల్డ్ కొనుగోలు ప్రియులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -