- Advertisement -
– తెలంగాణ షూటింగ్ చాంపియన్‌షిప్స్
హైదరాబాద్: మహ్మద్ ముజాహిద్ అలీ ఖాన్ పసిడి పతకం సాధించాడు. ఎస్-25 ట్రాప్ విభాగంలో 40/50తో మెరిసిన అలీ ఖాన్ గోల్డ్ మెడల్ గురి పెట్టాడు. ఫజల్ (40/50), చేతన్ రెడ్డి (35/50) సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. షాట్‌గన్ ఈవెంట్‌లో 70 మంది అథ్లెట్లు పోటీపడగా.. మహ్మద్ నహ్ది (39/50)తో స్వర్ణం సాధించగా… ఐచపోరియ, లతీఫ్‌లు రజత, కాంస్య పతకాలు సాధించారు. ఎస్-19 ట్రాప్ ఈవెంట్‌లో అహ్మద్ అన్సారీ గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ట్రాప్ విభాగంలో పతకాలు సాధించిన షూటర్లను తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు అమిత్ సంఘీ అభినందించారు.
- Advertisement -