Tuesday, December 23, 2025
E-PAPER
Homeఆటలుసురుచి సింగ్‌కు స్వర్ణం

సురుచి సింగ్‌కు స్వర్ణం

- Advertisement -

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌
మ్యూనిచ్‌ (జర్మనీ) :
భారత యువ షూటర్‌ సురుచి సింగ్‌ (19) ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ సాధించింది. కెరీర్‌లో మూడోసారి ప్రపంచకప్‌లో గన్‌ గురి పెట్టిన సురుచి సింగ్‌ మూడో బంగారు పతకం సాధించింది. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న షూటింగ్‌ ప్రపంచకప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగం ఫైనల్లో 0.2 పాయింట్ల తేడాతో ఫ్రాన్స్‌ షూటర్‌ కామిలెపై పైచేయి సాధించిన సురుచి సింగ్‌ ఫోగట్‌ పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది బ్యూఎయిర్స్‌, లిమా ప్రపంచకప్‌లోనూ సురుచి సింగ్‌ పసిడి పతకాలు సాధించింది. ఫైనల్లో సురుచి సింగ్‌ 214.9 పాయింట్లు సాధించగా.. కామెలె 241.7 పాయింట్లు సాధించింది. చైనా షూటర్‌ 221.7 పాయింట్లతో కాంస్య పతకం సాధించింది. మను భాకర్‌ పతక పోరుకు అర్హత సాధించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -