- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు గురువారం తగ్గాయి. దీంతో వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,100 తగ్గి రూ.1,41,450కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.2,290 పతనమై రూ.1,54,310 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.3,40,000 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.
- Advertisement -



