Tuesday, May 13, 2025
Homeబీజినెస్బంగారం దిగొస్తోంది..

బంగారం దిగొస్తోంది..

- Advertisement -

– రూ.1800 తగ్గుదల
న్యూఢిల్లీ :
భౌగోళిక ఆందోళనలు, టారిఫ్‌ ప్రభావాలతో భారీగా పెరిగిన బంగారం ధర తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య నెలకొన్న టారిఫ్‌ యుద్దానికి బ్రేక్‌ పడటానికి తోడు రష్యా, ఉక్రెయిన్‌ మధ్య కాల్పుల విరమణ సంకేతాలతో సోమవారం పసిడి ధర భారీగా తగ్గింది. న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్చత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.1800 తగ్గి రూ.96,880గా పలికింది. 22 క్యారెట్ల పసిడిపై రూ.1650 దిగివచ్చి రూ.88,800గా నమోదయ్యింది. కిలో వెండిపై రూ.1100 పతనమై రూ.97,900గా చోటు చేసుకుంది. ఇటీవలి వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో 3400 డాలర్ల ఎగువన ట్రేడయిన ఔన్సు బంగారం ధర తాజాగా 3218 డాలర్లకు దిగొచ్చింది. ప్రస్తుత సానుకూల వాతావరణంలో అతి సమీపంలోనే బంగారం ధర మరింత దిగివచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -