అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీ గురుకుల విద్యార్థులు తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించారు. ఈనెల 3,4 తేదీల్లో హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన క్రీడా పోటీల్లో గురుకుల విద్యాసంస్థల్లో ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తమ సత్తా చాటారు. 200, 400 మీటర్ల పరుగు పందెంలో మహబూబ్‌నగర్ జిల్లా కోయల్‌కొండ బీసీ గురుకుల కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న కే.శివకుమార్ వరుసగా రెండు స్వర్ణ పతకాలను సాధించాడు. 600 మీటర్ల పరుగు పందెంలో భువనగిరి జిల్లాలోని పోచంపల్లి బీసీ గురుకుల కాలేజీలో ఇంటర్ చదువుతున్న భరత్ స్వర్ణ పతకం సాధించాడు. స్వర్ణ పతకాలను గెలుచుకున్న విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్యదర్శి శ్రీధర్ అభినందించారు.
బీసీ గురుకుల విద్యార్థులకు స్వర్ణపతకాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES