- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. నిన్న పెరిగిన వెండి ధరలు కూడా ఈరోజు తగ్గాయి. బుధవారం గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు ఉదయం 6.40 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.160 తగ్గిపోయి రూ.97,470కి చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.160 పడిపోయి రూ. 89,340కి చేరింది. ఇదే సమయంలో ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.160 తగ్గి రూ .97,620కి చేరగా, 22 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ .89,490గా ఉంది.
- Advertisement -