నవతెలంగాణ-హైదరాబాద్ : బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఇటీవల ఒక్కరోజే తులం గోల్డ్ ధర రూ. 3000 పెరిగి షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పసిడి ధరలు లక్ష రూపాయల మార్కుకు చేరుకున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి భారీగా పుత్తడి ధరలు పెరిగాయి. నేడు తులం గోల్డ్ పై రూ. 2,730 పెరిగింది. వెండి ధరలు మాత్రం స్పల్పంగా తగ్గాయి. నేడు కిలో వెండిపై రూ. 100 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,846, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,025 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2500 పెరగడంతో రూ. 90,250 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,730 పెరగడంతో రూ. 98,460 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,400గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,610 వద్ద ట్రేడ్ అవుతోంది.
మరోసారి భగ్గుమన్న బంగారం ధరలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES