- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,370 పెరిగి తొలిసారి రూ.1,20,770కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,250 ఎగబాకి రికార్డు స్థాయిలో రూ.1,10,700 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,66,000కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
- Advertisement -