Thursday, November 20, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..రూ.75,000 వరకు సహాయం

విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..రూ.75,000 వరకు సహాయం

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్ : పదో తరగతి పూర్తి చేసిన, కానీ ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్. విద్యాధన్ స్కాలర్‌షిప్ 2025 ద్వారా ఇంటర్, డిగ్రీ స్థాయిలో సంవత్సరానికి రూ. 10వేల నుండి 75వేల‌ వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇది కేవలం స్కాలర్‌షిప్ మాత్రమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక నమ్మకమైన దారి కూడా.
విద్యాధన్ స్కాలర్‌షిప్ అంటే ఏమిటి?
విద్యాధన్ స్కాలర్‌షిప్‌ పథకం, సరోజిని డామోదరన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలవుతోంది. దీని లక్ష్యం ప్రతిభ గల పేద విద్యార్థులకు విద్యా సహాయం అందించడం, మెంటారింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా వ్యక్తిత్వ వికాసం, ఇంటర్‌ తర్వాత కూడా డిగ్రీ వరకు స్కాలర్‌షిప్‌ను కొనసాగించడం
విద్యాధన్ స్కాలర్‌షిప్ 18 రాష్ట్రాలలో అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిషా, ఢిల్లీ, లడఖ్, పంజాబ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్. రాష్ట్ర‌ల‌లో అమ‌లు అవుతుంది.
అర్హతలు
2025లో 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి
వార్షిక కుటుంబ ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదు
సాధారణ విద్యార్థులకు 90% లేదా 9 CGPA, వికలాంగులకు 75% లేదా 7.5 CGPA
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
ఆన్‌లైన్ అప్లికేషన్ – ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు
అకాడమిక్ ప్రదర్శన ఆధారంగా ప్రాథమిక జాబితా
స్క్రీనింగ్ టెస్ట్ – ఆన్లైన్‌లో
వెబ్ ఇంటర్వ్యూ/మౌఖిక పరీక్షలు
తుది ఎంపిక – ఫౌండేషన్ ఆధారంగా
ముఖ్యమైన తేదీలు
జూన్ 30 దరఖాస్తుకు చివరి తేదీ
జూలై 13 అన్‌లైన్ పరీక్ష
ఇంటర్వ్యూల షెడ్యూల్ (మెయిల్ ద్వారా తెలియజేస్తారు)
అవసరమైన డాక్యుమెంట్లు
10వ తరగతి మార్క్ షీట్
ఆదాయ ధ్రువీకరణ పత్రం
విద్యార్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
సంప్రదించాల్సిన వివరాలు
Email: [email protected]
Phone: 080-68333500
web site : https://www.vidyadhan.org/apply#

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -