Wednesday, February 4, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్రైతుల‌కు శుభ‌వార్త‌…అకౌంట్లోకి డ‌బ్బులు ఎప్పుడంటే..?

రైతుల‌కు శుభ‌వార్త‌…అకౌంట్లోకి డ‌బ్బులు ఎప్పుడంటే..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ పథకం కింద రూ.2 వేల చొప్పున రైతు ఖాతాల్లో జమ చేయనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తైన క్రమంలో ఏ క్షణంలో అయినా రైతులకు నిధులను విడుదల చేయనుంది. ఈ నెల చివరికల్లా 22వ విడత సొమ్మును రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బడ్జెట్ వల్ల పీఎం కిసాన్ నిధుల విడుదల ఆలస్యమవ్వగా.. ఇప్పుడు ఆ పని పూర్తవ్వడంతో ఫిబ్రవరి చివరి వారంలో నిధులను ప్రధాన మోడీ స్వయంగా బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేయనున్నారని సమాచారం.
అయితే రైతు భరోసా డబ్బులను కూడా అటుఇటుగా ఫిబ్రవరి చివరి వారంలోనే జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పండక్కి ఈ నిధులను విడుదల చేయాల్సి ఉండగా.. సాగులో ఉన్న పంట భూములను గుర్తించే శాటిలైట్ సర్వే ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల జాప్యం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -