- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.91,450 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.450 తగ్గి రూ.91,000గా ఉంది. అలాగే నిన్న రూ.99,770 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.490 తగ్గి రూ.99,280 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.1000 కిలో రూ.1,24,000గా ఉంది.
- Advertisement -