నవతెలంగాణ – హైదరాబాద్ : హాస్టల్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, గురుకులాలు, మోడల్ స్కూల్స్, గిరిజన పాఠశాలలు సహా ప్రభుత్వ సొసైటీల ద్వారా నిర్వహించే విద్యా సంస్థల్లోని విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఎడ్యుకేషన్ కిట్లు అందజేయనుంది. మొత్తం 24 వస్తువులతో కూడిన కిట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవ్వనున్నారు. దీనివల్ల దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే డే స్కాలర్‌లకు బూట్లు, సాక్సులు, బెల్టులు ఇవ్వాలని నిర్ణయించింది. దీనివల్ల 19 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని అధికారులు తెలిపారు. కిట్‌లో యూనిఫామ్ (స్కూల్, వైట్ యూనిఫాం), బ్యాగ్, షూ, సాక్సులు, బెల్టు, టై, ఐడీకార్డు హోల్డర్, స్టేషనరీ కిట్, పీటీ డ్రెస్, నైట్‌డ్రెస్, ట్రాక్‌సూట్, కార్పెట్, బెడ్‌షీట్, బ్లాంకెట్, టవల్, ప్లేటు, గ్లాస్, కటోర, కప్పు, స్పూన్, ట్రంకు పెట్టే, నోటు పుస్తకాలు, ట్రాలీబ్యాగ్ ఉంటాయి.
ప్రభుత్వ పాఠశాలల విద్యర్థులకు గుడ్ న్యూస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



