Wednesday, February 25, 2026
E-PAPER
Homeఆటలుభారత్‌కు గుడ్ న్యూస్.. బ్యాటర్లకు పండగే

భారత్‌కు గుడ్ న్యూస్.. బ్యాటర్లకు పండగే

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారీ తేడాతో ఓటమి పాలవ్వడం టీమిండియా అవకాశాలను సంక్లిష్టంగా మార్చింది. దీనికి తోడు జింబాబ్వేపై వెస్టిండీస్ 106 పరుగుల భారీ తేడాతో గెలవడంతో భారత జట్టుపై ఒత్తిడి మరింత పెరిగింది. సెమీస్ రేసులో నిలవాలంటే, భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌లలో కేవలం గెలవడమే కాకుండా, నెట్ రన్ రేట్ (NRR) మెరుగుపర్చుకునేందుకు భారీ తేడాతో విజయాలు సాధించడం తప్పనిసరి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత జట్టుకు ఓ సానుకూల వార్త ఊరటనిస్తోంది. రేపు జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలోని కొత్త పిచ్‌పై నిర్వహించనున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఈ పిచ్‌ను ప్రపంచకప్‌కు కొద్ది రోజుల ముందే సిద్ధం చేశారని, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి దేశవాళీ మ్యాచ్‌లు జరగలేదని తెలిసింది. దీంతో బంతి బ్యాట్‌పైకి సులభంగా వస్తుందని, ఇది బ్యాటర్లకు భారీగా కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. భారీ స్కోర్లు సాధించి నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవాలనుకుంటున్న భారత్‌కు ఇది శుభవార్తే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -