నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎల్ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు, ఎంపీ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. “బీసీసీఐ ఇప్పటికే టోర్నమెంట్ ప్రారంభ దశ షెడ్యూల్‌ను విడుదల చేసింది, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మిగిలిన మ్యాచ్‌లను నిర్ణయిస్తుంది.” ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. మేము 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసాము. ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల తేదీలను ప్రకటించిన తర్వాత మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల చేయబడుతుంది” అని శుక్లా అన్నారు.
ఐపీఎల్-2026 20 రోజుల పాటు 19వ ఎడిషన్ ఐపీఎల్ ఈ నెల 28 నుంచి మే 31 వరకు జరగనుంది. మొత్తం షెడ్యూల్‌ను ఒకేసారి ప్రకటించకపోవడానికి పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మ్యాచ్‌ల తేదీలు ఎన్నికలతో ఇబ్బంది లేకుండా చూసేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.



