Saturday, May 17, 2025
Homeట్రెండింగ్ న్యూస్మరో 46 రోజులు వేసవి సెలవులు పొడిగింపు..!

మరో 46 రోజులు వేసవి సెలవులు పొడిగింపు..!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో సమ్మర్‌ హీట్‌ అంతకంతకూ ముదురుతోంది. ఇంటి నుంచి బయటకు రావడానికే ప్రజలు భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల విద్యార్థులకు చల్లని కబురు అందింది. కేంద్ర విద్యా శాఖ అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు 2025 జూన్ 1 నుంచి 2025 జులై 16 వరకు 46 రోజుల వేసవి సెలవులను ప్రకటించింది.
తరగతులు 2025 జులై 17న తిరిగి ప్రారంభమవుతాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రక్షణ కల్పించేందుకే వేసవి సెలవులు ఎక్కువ కాలం పొడిగించారు. ఈ ప్రకటన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు భారీ ఉపశమనం కలిగించింది.
వేసవి సెలవుల వివరాలు
భారతదేశంలో కొన్ని కీలక రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు 46 రోజుల సెలవులు వర్తిస్తాయి. చాలా రాష్ట్రాలు జూన్ 1 నుంచి జులై 16 వరకు షెడ్యూల్‌ ఫాలో అవుతాయి. కొన్ని స్థానిక అవసరాల ఆధారంగా తేదీలను కొద్దిగా సర్దుబాటు చేయవచ్చు.
ఉత్తర ప్రదేశ్: 2025 జూన్ 1 నుంచి జులై 16 వరకు (46 రోజులు, అన్ని పాఠశాలలు).
మహారాష్ట్ర: 2025 మే 30 నుంచి జులై 14 వరకు (46 రోజులు, అన్ని పాఠశాలలు).
తమిళనాడు: 2025 జూన్ 1 నుంచి జులై 16 వరకు (46 రోజులు, అన్ని పాఠశాలలు).
ఢిల్లీ NCR: 2025 జూన్ 1 నుంచి జులై 16 వరకు (46 రోజులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు).
రాజస్థాన్: 2025 మే 31 నుంచి జులై 15 వరకు (46 రోజులు, ప్రభుత్వ పాఠశాలలు).
పశ్చిమ బెంగాల్: 2025 జూన్ 2 నుంచి జులై 17 వరకు (45 రోజులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు).
కర్ణాటక: 2025 మే 30 నుంచి జులై 14 వరకు (46 రోజులు, ప్రభుత్వ, సహాయక పాఠశాలలు).
బీహార్: 2025 జూన్ 1 నుంచి జులై 16 వరకు (46 రోజులు, అన్ని పాఠశాలలు).
ఈ సంవత్సరం వేసవి సెలవులు గత సంవత్సరం కంటే ఎక్కువ. 2024లో విద్యా సంవత్సరం ఆలస్యం కావడంతో పాఠశాలలకు జూన్ 5 నుంచి జులై 10 వరకు 36 రోజుల సెలవులు వచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -