Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్పేదలకు శుభవార్త..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పేదలకు శుభవార్త..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని అన్నపూర్ణ క్యాంటీన్లను ఇకపై ఇందిరా క్యాంటీన్లుగా పిలుస్తారు. ఈ నిర్ణయాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్టాండింగ్ కమిటీ తీసుకుంది. ఇందుకు సంబంధించి జూన్ 26న ఓ సమావేశం పెట్టుకుంది. పేరు మార్చడమే కాదు.. మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పటివరకూ అన్నపూర్ణ క్యాంటీన్లలో రూ.5కే భోజనం మాత్రమే లభించేది. ఇకపై టిఫిన్ కూడా లభిస్తుంది. ఇది పేదలు, కూలీలు, వర్కర్లు, కార్మికులకు అనుకూలంగా ఉంటుంది.

టిఫిన్ మెనూ గమనిస్తే.. ఇడ్లీ, వడ, ఉప్మా, టమాట బాత్ వంటివి ఉంటాయి. వీటిలో ఏది కావాలన్నా రూ.5కే లభిస్తుంది. ఇందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల పేదలు.. మరింత చవకగా.. నాణ్యమైన టిఫిన్‌ని కొనుక్కోగలరు. అసలే బయట టిఫిన్ రూ.40 నుంచి రూ.90 దాకా ఉంటోంది. బెంగళూరు సిటీ మధ్యలో 2 ఇడ్లీలు కూడా రూ.100 ఉంటాయి. అలా రేట్లు పెరిగిపోతున్న ఈ రోజుల్లో రూ.5కే టిఫిన్ అంటే.. గొప్ప విషయమే అంటున్నారు పేదలు.
ప్రస్తుతం GHMC పరిధిలో 373 అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్నాయి. కానీ వీటిలో 53 కేంద్రాలు రకరకాల కారణాలతో మూతపడ్డాయి. మిగిలిన 320 క్యాంటీన్లు రోజూ ఓపెన్ అవుతున్నాయి. వీటిలో సుమారు 40,000 మంది రోజూ రూ.5కే భోజనం తింటున్నారు. ఇప్పుడు ఈ క్యాంటీన్లను సరికొత్తగా తీర్చిదిద్దుతారు. వీటిలో ఫర్నిచర్, ఇతరత్రా అవసరమైన మార్పులు చేస్తారు. అందువల్ల కస్టమర్లకు ఇవి మరింత అనుకూలంగా మారతాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad