Thursday, May 8, 2025
Homeఆటలుటెస్టులకు గుడ్‌బై

టెస్టులకు గుడ్‌బై

- Advertisement -

– వన్డేల్లో కొనసాగుతా..: రోహిత్‌ శర్మ
ముంబయి:
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌నుంచి వైదొలుతున్నట్లు ట్విటర్‌(ఎక్స్‌) వేదికగా బుధవారం తెలిపాడు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని.. ఇన్నేళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నాడు. టెస్ట్‌ క్రికెట్‌లో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నాడు. 38ఏళ్ల రోహిత్‌ 2013లో టెస్టుల్లో మిడిలార్డర్‌ బ్యాటర్‌గా అరంగేట్రం చేసి వెస్టిండీస్‌పై అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టాడు. 67 టెస్టుల్లో 40.57 సగటుతో 4,301 పరుగులు చేశాడు. ఇందులో 12సెంచరీలు, 18అర్ధ సెంచరీలున్నాయి. 2019 నుంచి ఓపెనింగ్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్నాడు. 2021లో ఏడాదిలో 47.68సగటుతో 906 పరుగులు చేశాడు. ఇక 2024లో 24.76సగటుతో నిరాశపరచాడు. 2024-25 టెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌కు భారత్‌ను చేర్చడంలో రోహిత్‌ శర్మ విఫలమయ్యాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో 1-3తో ఓటమితోపాటు.. స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలోనూ టెస్ట్‌ సిరీస్‌ 0-3తో వైట్‌వాష్‌కు గురయ్యాడు.
రోహిత్‌ ఇప్పటికే అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో రోహిత్‌ శర్మ ఇక వన్డేల్లో మాత్రమే కొనసాగుతాడు. రోహిత్‌ శర్మ సారథ్యంలో టీమిండియా రెండుసార్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌లో ఫైనల్‌కు చేరింది. జూన్‌లో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. టెస్టుల్లో భారతజట్టుకు కెప్టెన్సీ రేసులో జస్‌ప్రీత్‌ బుమ్రా, శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -