గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఓ పీరియాడిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో, భారీ స్థాయిలో షూటింగ్ జరుగుతోంది. గోపీచంద్ నటిస్తున్న తన 33వ చిత్రమిది. ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని మేకర్స్ పోస్టర్‌తోపాటు గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో గోపీచంద్ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఒక యోధుడిగా అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. పొడవాటి జుట్టు, యుద్ధగాయాలు, నుదిటిపై వీర తిలకంతో కనిపించిన ఇంటెన్స్ లుక్ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. చేతిలో ఖడ్గంతో యుద్ధరంగంలో కనిపించిన ఈ పోస్టర్ శక్తి, శౌర్యాన్ని ప్రజెంట్ చేస్తోంది.
మంచుతో కప్పబడిన అద్భుతమైన పర్వత శ్రేణుల నడుమ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఓ యోధుడు తన టెంట్ నుంచి బయటకు వస్తాడు. తాను ప్రేమగా పెంచిన గుర్రంతో మమేకమయ్యే విజువల్‌లో తన తలను గుర్రం తలపై ఆనిస్తూ, మౌనంగా ఓ వాగ్దానాన్ని చేస్తాడు. దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో ‘ధీర ధీర’ సంగీతం మ్యాజికల్ అనుభూతిని కలిగిస్తుంది. ఈ విజువల్స్ మనసును తాకుతూనే పవర్‌ఫుల్‌గా, పీస్ మెడిటేటివ్ ఫీల్‌ను ఇస్తున్నాయి. ఐబీ 71 (ఆకాశంలో), ఘాజి (నీటిలో), అంతరిక్షం (అంత రిక్షంలో) వంటి విభిన్న కథ చిత్రాలతో తన ప్రత్యేక కథనశైలి, సాంకేతిక నైపుణ్యంతో గుర్తింపు పొందిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఇప్పుడు మరో డిఫరెంట్ జోనర్‌లోకి అడుగుపెట్టారు.
ఈ సినిమాలో భారతదేశ చరిత్రలో మరిచిపోయిన ఒక కీలక ఘట్టాన్ని సంకల్ప్‌రెడ్డి అద్భుతంగా మలిచారు. 7వ శతాబ్దం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఒక చారిత్రక ఘటనను ఆవిష్కరిస్తూ, మరిచిపోయిన అధ్యాయానికి మళ్లీ జీవం పోస్తోంది. గోపిచంద్ ఈ సినిమాలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడనివంటి విభిన్న పాత్రలో కనిపించనున్నారు. కాశ్మీర్ అందమైన లొకేషన్లలో తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. ఆ అద్భుత దశ్యాలు బిగ్ స్క్రీన్‌పై గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో రూపొందించిన సెట్లో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభమైంది.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి,
సమర్పణ: పవన్ కుమార్.
యోధుడిగా గోపీచంద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES