నవతెలంగాణ-డిచ్ పల్లి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ని ఆదివారం హైదరాబాద్ లోని అయిన నివాసం లో దర్పల్లి మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి ముదిరాజ్ కలిసి శాలువా,పులబోకేతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఇమ్మడి గోపి ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,టి పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ లో సీనియర్ నాయకులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కి కేబినేట్ హోదాలో సిఎం సలహాదారులు గా నియమించడం శుభ పరిణామం అన్నారు.మున్ముందు మరిన్ని పదవులను అధిరోహించలని, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి కి సైతం ఒక మంచి హోదా కలిగలని కోరుకుంటున్నారన్నారు.అయన వేంట సీనియర్ నాయకులు రొహిత్ గౌడ్, మహిపాల్. నాయక్, బలు తోపాటు తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డిని సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



