నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంటి అవసరాలకు వాడే ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్‌లకు సంబంధించి ప్రబుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం ఉన్నందున, గృహ వినియోగం కోసం ఎల్‌పీజీ సిలిండర్ పొందడానికి వెయిటింగ్ పీరియడ్ సమయాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచారు. బ్లాక్ మార్కెట్‌ను కట్టడి చేస్తూనే, సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే భయాలతో పెరిగిన బుకింగ్‌లను నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదివరకు సగటున 55 రోజులకు ఒకసారి సిలిండర్‌ను బుక్ చేసుకునే వాళ్లలో చాలామంది ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో 15 రోజులకే బుక్ చేస్తున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది, దీంతో 21 రోజులకు లాక్-ఇన్ పీరియడ్ విధించిన తర్వాత సోమవారం గిరాకీని దృష్టిలో ఉంచుకుని ఈ గడువును 25 రోజులకు పెంచింది. యుద్ధ పరిస్థితుల వల్ల సరఫరా సాధారణ స్థితికి చేరేందుకు ఖచ్చితమైన సమయం చెప్పలేనప్పటికీ, ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఓ అధికారి తెలిపారు. ఇతర దేశాల కంటే మెరుగైన స్థితిలోనే ఉన్నామని పేర్కొన్నారు. కాగా, ఇటీవలే ఇంటి అవసరాలకు వాడే సిలిండర్‌పై ప్రభుత్వం రూ. 60 పెంచిన సంగతి తెలిసిందే. ఇరాన్ అనిశ్చితి కారణంగా కమర్షియల్ వినియోగం కంటే ఇంటి అవసరాలకు గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కేంద్రం చమురు సంస్థలకు ఆదేశాలిచ్చింది. ఇతర దేశాలతో ఎల్‌పీజీ కొనుగోళ్ల ప్రక్రియ జరుపుతున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
సిలిండర్ బుకింగ్ గడువు పెంచిన ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



