నవతెలంగాణ – హైరదాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం తీపికబురు చెప్పింది. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ 2026 సీజన్ మ్యాచ్‌ల నిర్వహణకు అధికారికంగా అనుమతినిచ్చింది. గత ఏడాది ఆర్సీబీ విజయోత్సవాల సమయంలో జరిగిన విషాదకర తొక్కిసలాట ఘటన తర్వాత స్టేడియంలో భద్రతపై నెలకొన్న సందిగ్ధతకు ఈ నిర్ణయంతో తెరపడింది. జస్టిస్ డి.కున్హా కమిటీ సూచించిన భద్రతా ప్రమాణాలను కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పూర్తి చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 13న నిపుణుల కమిటీ స్టేడియంను స్వయంగా తనిఖీ చేసి, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. స్టేడియంలోకి ప్రవేశించేందుకు కొత్త గేట్లు, అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లేందుకు అదనపు ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అలాగే, స్టేడియం సామర్థ్యానికి మించి టిక్కెట్లు విక్రయించకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ను మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చిన్నస్వామి స్టేడియంలోనే ఆడనుంది.
చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



