నవతెలంగాణ-చారకొండ: రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కల్లు సురేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నారయణ్ సర్సింహరెడ్డి అన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సహకారంతో 60 శాతం సబ్సిడీతో మంజూరైన స్పింక్లర్ పైపులను మంగళవారం మండలంలోని సిరసనగండ్లలో 10 మంది రైతులకు కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హాయంలో రైతులను పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రైతు సంక్షేమానికి అధిక నిధులు కేటాయించి రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వ్యవసాయ పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో హెచ్ఓ మహేశ్వరి, కడారి వెంకటయ్యయాదవ్, సందీప్ రెడ్డి, కొండల్ రెడ్డి, రామస్వామి, జంగయ్య, వెంకటయ్య, సైదులు, హనుమంత్
‘రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES