Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుమహిళా అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి సీతక్క

మహిళా అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి సీతక్క

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
అన్నిరంగాల్లో మహిళలకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యతతో  ఆర్థిక అభివృద్ధికి  పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర పంచాయితీ రాజ్,మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం పెద్దాపూర్ గ్రామంలోని యువ నాయకులు కాయితి కిషోర్ రెడ్డి నివాసానికి చేరుకున్న మంత్రి  సీతక్కతో పాటు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి లను మహిళలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్రోల్ పంపులు,ఆర్టీసీ అద్దె బస్సులను మహిళా సంఘాలకు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు.  సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఆడబిడ్డలకు అందిస్తున్నామని ఉద్ఘాటించారు. త్వరలో మరిన్ని వ్యాపారాల్లోకి మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టామని మంత్రి తెలిపారు.

అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలతో పాటు సమాన వేతనాలు ఉండాలన్న లక్ష్యంతో మహిళలకు భూగర్భం నుంచి అంతరిక్ష రంగం వరకు అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు రావాలని తపించి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టామని మంత్రి పేర్కొన్నారు.  మహిళా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక రక్షణతో పాటు సామాజిక భద్రత కల్పిస్తున్నామని మంత్రి  తెలిపారు. ఈ ఏడాది అనుకున్న లక్ష్యాలకు మించి మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించామని రూ.20వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించుకుంటే.. రూ.22 వేల కోట్ల వరకు రుణ సౌకర్యం కల్పించామని మంత్రి వివరించారు. రాజ్యాలు సొంతగా పాలన చేసేలా మహిళలు ఎదగాలని ఆమె ఆకాక్షించారు.

మహిళలే అసలు సిసలు ఆర్థిక శాస్త్రవేత్తలు.పుస్తకాల ఆర్థిక శాస్త్రవేత్తలు ఎందరో ఉంటారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కిషోర్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ కార్యదర్శులు మెరుగు రమేష్ రెడ్డి,తక్కళ్ళపల్లి శేఖర్,కిసాన్ సెల్ తాలుకా అధ్యక్షులు పర్వత్ రెడ్డి,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటిక రామస్వామి,పోలే రాజు,పాండు నాయక్,రమేష్ నాయక్,జయంత్ రెడ్డి,నెంట రాజు,కొప్పు ఏర్రయ్య, జగన్,శ్రీకాంత్ రెడ్డి,జిలానీ,రాఘవేందర్ రెడ్డి,సురేష్,అనిల్ నాయక్,ఆదర్శ్,కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad