Monday, September 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కుట్ర పన్నుతోంది: హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కుట్ర పన్నుతోంది: హరీష్ రావు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రాజెక్టులోని మోటార్లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసి, ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

ప్రస్తుతం కాళేశ్వరం పంపుహౌస్‌లలోని మోటార్లను రోజుకు రెండు నుంచి మూడుసార్లు అనవసరంగా ఆన్, ఆఫ్ చేస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇలా తరచూ విద్యుత్ సరఫరాను నిలిపివేసి, తిరిగి ప్రారంభించడం వల్ల మోటార్లలోని కీలకమైన బేరింగ్‌లు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మోటార్లు పాడైపోయిన తర్వాత, దానిని సాకుగా చూపి తమను బద్నామ్ చేయాలన్నదే ప్రభుత్వ అసలు ఉద్దేశమని ఆయన ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -