కాపాడాలని రైతుల ఆవేదన..
విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
రాత్రికి రాత్రి ప్రభుత్వ భూమిలో మొక్కలను నాటుతున్నారని ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని మండేపల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని మండేపల్లి లో ప్రభుత్వ భూమి దాదాపు 5 ఎకరాల స్థలంలో కొందరు కబ్జా చేసి రాత్రికి రాత్రే చదును చేస్తూ మొక్కలను నాటుతున్నారని రైతులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గతంలో రెవెన్యూ అధికారులకు గ్రామస్తుల ఫిర్యాదు చేయడంతో ఆర్ ఐ దినేష్ విచారణ చేపట్టారు.
గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం భూమి రెవెన్యూ కి చెందాలి లేకుంటే గ్రామ అభివృద్ధి కోసం వడ్ల బీటుకు అందజేయాలని వివరించారు. భూమికి సంబంధించిన పత్రాలు ఉంటే రాత్రిపూట దున్నడమేంటి రాత్రి పూట చెట్లు పెట్టడం ఏంటని ఆరోపించారు.ఇప్పటికే గ్రామంలోని 377 సర్వే నంబర్ లో 360 ఎకరాల భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు.మిగిలిన భూమి ఇలాంటి భూకబ్జాదారుల చేతిలోకి వెళ్తుందని, గ్రామంలో పశువులు, మేకలు మేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు.భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని క్రీడా ప్రాంగణానికి అందజేయాలని కోరారు.



