నవతెలంగాణ – పరకాల : ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూలు పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ.. మల్లారెడ్డిపల్లీ స్కూల్లో 50 మందికి పైగా విద్యార్థులు ఉండగా సరైన తరగతి గదులు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అంతేకాకుండా రాజీ పేట ప్రైమర్ స్కూల్, పరిషత్ ఉన్నత పాఠశాలలో సైతం తగినన్ని తరగతి గదులు లేకపోవడంతో పాటు,మంచినీటి సౌకర్యం, యూరినల్స్ తదితర మౌలిక సదుపాయాలు లేవని ఆరోపించారు.
వెంటనే ప్రభుత్వం స్పందించి మౌలిక సదుపాయాలతో పాటు, ఆయా పాఠశాలల్లో తగినన్ని తరగతి గదులు, యూరినల్స్ నిర్మించాలని కళ్యాణ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ పట్టణ కార్యదర్శి కోగీల సాయి తేజ పట్టణ ఉపాధ్యక్షుడు యశ్వంత్ పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES