- సుమారు 97.71 శాతం ఉత్తీర్ణత
- మొదటి స్థానంలో సత్యసాయి..
ద్వితీయ స్థానంలో బాలికల పాఠశాల..
చివరి స్థానంలో తోటపల్లి - నవతెలంగాణ-బెజ్జంకి
- రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పది ఫలితాల్లో మండలంలోని అయా ప్రభుత్వోన్నత పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సత్తాచాటారు.మండల కేంద్రంలోని సత్య సాయి గురుకుల విద్యాలయం,బాలికల,బాలుర, బేగంపేట,దాచారం,గాగీల్లపూర్,కల్లేపల్లి,కేజీబీవీ ఉన్నత పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి.మండలంలో సుమారు 97.71 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది.మండల కేంద్రంలోని సత్యసాయి గురుకుల విద్యాలయ విద్యార్థి సాయిఈశ్వర్ పదిలో 554 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు.బాలికల ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థిని హర్షిత 548 మార్కలు సాధించి రెండో స్థానంలో నిలిచింది.ఆదర్శ 98.58 శాతం,గుగ్గీల్ల 93.34 శాతం,రేగులపల్లి 92.86 శాతం,గుండారం 92.31 శాతం,తోటపల్లి ప్రభుత్వోన్నత పాఠశాల సుమారు 80 శాతం ఉత్తీర్ణత సాధించి చివరి స్థానంలో నిలిచింది.మండలంలో సుమారు 349 మంది విద్యార్థుల పది పరీక్షలకు హజరవ్వగా 341 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అయా పాఠశాల భోదన సిబ్బంది అభినందించారు.
- Advertisement -