- తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జి.రవిందర్
- నవతెలంగాణ – మల్హర్ రావు
- మావోయిస్టులతో ప్రభుత్వం శాoతి చర్చలు జరపాలని తుడుండెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవిందర్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సామాజిక అంశంపై పోరాడుతున్న మావోయిస్టులపై యుద్ధమా? అమాయకపు ఆదివాసీలను చంపే హక్కేక్కడిదన్నారు.చత్తీస్ఘడ్/కర్రేగుట్ట ప్రాంతాల్లో జరుగుతున్న ఆపరేషన్ కాగర్ నరమేధాన్ని నిలిపివేయాలన్నారు.నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలి తుడుందెబ్బ డిమాండ్ చేస్తోందన్నారు.అడవిని నమ్ముకొని బ్రతుకుతున్న ఆదివాసీలను ఉచ కోస కోస్తున్న తరుణం అడవిని కాపాడుతున్న ఆదివాసీల మీద యుద్ధం ప్రకటించడం అంటేనే ప్రభుత్వం ఎంత దారుణానికి ఒడికట్టుతుందో తెలుస్తుందన్నారు.శత్రు దేశాలమీద యుద్ధం ప్రకటించినట్టు స్వదేశంలో ఓటర్ల పై యుద్ధం చేయడం అంటేనే అటవీ సంపదను బహుళ జాతి కంపెనీలకు కట్టుపేడతామణి చేస్తున్నా ప్రయత్నం నిత్య అవసరపు వస్తువులను కూడ నిషేదిస్తూ ఆకలి మరణాలను ప్రోత్సహిస్తూ ఆదివాసీలను అంతమోందించాలనీ చూస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పే విదంగా ఆదివాసీలందరు ఏక తాట పై వచ్చి పోరాట రూపం దాల్చాలని అన్ని గ్రామ స్థాయి కమిటీల నుండి జిల్లా కమిటీలు వెంటనే నిరసన కార్యక్రమంలు ముమ్మురం చెయ్యాలని పిలుపునిచ్చారు.
- Advertisement -