నవతెలంగాణ – ధర్మసాగర్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక పక్షాన నిలబడి వారి సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చిలుక రాఘవులు అన్నారు. గురువారం మేడే సందర్భంగా మండల మండలంలో పలు గ్రామాల్లో కార్మికులు రైతు సంఘాల నాయకులు, వేసే కార్మిక సంఘాలు, భవన నిర్మాణ కార్మికులు, సిపిఎం సిపిఐ అనుబంధ సంఘాల నాయకులు జెండాను ఆవిష్కరించి మేడేను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. వారి సంక్షేమం కోసం పాటుపడే విధంగా ప్రభుత్వాలు సంక్షేమ నిధులను కేటాయించి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్, రాజేశ్వరి, ప్రమీల, రాజు,రమ,స్వరూప, వివిధ సంఘాల నాయకులు ప్రజలు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వాలు కార్మిక పక్షాన నిలవాలి
- Advertisement -
RELATED ARTICLES