- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. గాంధీజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. వారితోపాటు స్పీకర్ ప్రసాద్‌కుమార్,మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.
- Advertisement -