రూ.50 వేలు ఆర్థిక సహాయం
నవతెలంగాణ-పాలకుర్తి
మండలంలోని విసునూరు గ్రామానికి చెందిన బాలగాని కుమార్ నాలుగు నెలల క్రితం ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుండి కాలుజారి క్రింద పడడంతో నడుము విరిగి మంచానికే పరిమితమయ్యాడు. తాటి చెట్లు ఎక్కి కుటుంబాన్ని పోషించుకుంటున్న కుమార్ తీవ్ర గాయాలతో తాటిచెట్లు ఎక్కకపోవడంతో కుమార్ ను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో పాలకుర్తి ఎక్సైజ్ ఎస్సై పద్మ గౌడ్ సహకారంతో శుక్రవారం కుమార్ కు రాష్ట్ర గౌడ యూనిఫామ్ ఆఫీసర్స్ యూనియన్ బాధ్యులు, కే జి ఎఫ్ (ఎన్నారై) బాధ్యులు 50,000 ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు.
అదిలాబాద్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి రవీందర్ గౌడ్, అసిస్టెంట్ కమిషనర్ ఏ చంద్రయ్య గౌడ్, మలక్పేట ఎస్హెచ్ఓ నరేందర్ గౌడ్, దూల్పేట ఎస్సై సైదులు గౌడ్, ఆలేరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దీపిక గౌడ్ లు కుమార్ కు ఆర్థిక సహాయాన్ని అందించారు. దీనావస్థలో ఉన్న కుమార్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో ఆర్థికంగా అండగా నిలవలన్న లక్ష్యంతో పాలకుర్తి ఎక్సైజ్ ఎస్సై పద్మా గౌడ్ చొరవతో రాష్ట్ర గౌడ యూనిఫామ్ ఆఫీసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అండగా నిలిచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజీ కేఎస్ జిల్లా అధ్యక్షుడు కుర్ర ఉప్పలయ్య గౌడ్, తెలంగాణ గౌడ సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజు గౌడ్ లతోపాటు గీతా కార్మికులు, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.