Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఎంపీడీఓకు వినతిపత్రం అందించిన జీపీ కార్మికులు

ఎంపీడీఓకు వినతిపత్రం అందించిన జీపీ కార్మికులు

- Advertisement -

– పంచాయితీ కార్మికులకు రూ.26 వేలు చెల్లించాలి 
– సీఐటీయూ ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట 

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని,జీవో 51 ని సవరించి మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో అప్పారావు కి అందజేశారు.  ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బందిని రెండవ పీఆర్సీ పరిధిలోకి తీసుకువచ్చి వేతనాలు పెంచాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామపంచాయతీ సిబ్బంది కి ఉద్యోగ భద్రత కనీస వేతనాలు అందజేస్తామని ఆరోగ్య, జీవితం భీమా సౌకర్యం కల్పిస్తామని తన ఎన్నికల మేనిఫెస్టో లో హామీ  ఇచ్చిందని, అధికారంలోకి రెండో సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు గ్రామ పంచాయతీ కార్మికులు సమస్యలు ప్రభుత్వం గుర్తించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసారు.

ఇస్తున్న టు వంటి కొద్దిపాటి వేతనాలు కూడా నెల నెలా సక్రమంగా రావడం లేదని అది కూడా ఆందోళనలు నిర్వహిస్తే నే కంటి తుడుపు చర్యగా ఒక నెల జీతం వేసి చేతులు దులుపు కుంటుందని అన్నారు.జీతాల సమస్యపై కూడా గత జనవరిలో ముఖ్యమంత్రి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వమే కార్మికుల అకౌంట్లో వేతనాలు చెల్లిస్తామని ప్రకటించిందని ఏ ఒక్క నెల కూడా ఇచ్చిన వాగ్దానం మేరకు జీతాలు చెల్లించలేదని అన్నారు. కార్మికులకు హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని అన్నారు.గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, కేటగిరి వారీగా వేతనాలు పెంచాలని, చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కేసుపాక నరసింహారావు, గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల కార్యదర్శి కొడిమి వినోద్,చందా రామారావు, వెంకయ్య, మహేష్, విజయ్, రంగారావు, బాలరాజు, లక్ష్మణరావు, రాముడు, రాజు జోగారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad