నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
పట్టణంలోని జీనియస్ పాఠశాలలో శనివారం యూకేజీ విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ బి సూర్యనారాయణ రెడ్డి, చైర్మన్ పడాల శ్రీనివాస్, డైరెక్టర్ తోట శ్రీధర్ హాజరై, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థులకు పట్టాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ డాక్టర్ బి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు మా ఉపాధ్యాయులు నూతన విద్యా విధానంతో పాఠాలు బోధిస్తున్నామని అన్నారు.
అన్ని రంగాలలో విద్యార్థులు రాణించడానికి వారిని ప్రోత్సహిస్తూ వారిలో నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నామని అన్నారు. యూకేజీ విద్యార్థులకు ఇలాంటి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో అనుభూతిని పొందుతారని అన్నారు. చైర్మన్ పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు కావలసిన అన్ని వసతులతో పాటు వనరులను సమకూర్చి విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా విశాలమైన తరగతి గదులు క్రీడాస్థలాలు ఏర్పాటు చేసి విద్యార్థులను అన్ని రంగాలలో ముందు ఉంచడానికి మా యాజమాన్యం ఎప్పుడు ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తోట శ్రీధర్, ప్రిన్సిపల్ బి స్వర్ణలత, ఏవో జి రవి, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.



