Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ టైం స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

 టైం స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-హలియా 
లియాలోని టైం స్కూల్లో  విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి హాజరై చిన్నారుల ప్రతిభను అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య అనేది భవిష్యత్తుకు బలమైన పునాది అని, చిన్నారులలో మంచి విలువలు, క్రమశిక్షణ మరియు జ్ఞానాన్ని పెంపొందించడంలో పాఠశాలల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. టైమ్ స్కూల్ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి సంస్కారాలను అందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న విద్యాసంస్థగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు.   విద్య అనేది భవిష్యత్తుకు బలమైన పునాది అని, చిన్నారులలో మంచి విలువలు, క్రమశిక్షణ మరియు జ్ఞానాన్ని పెంపొందించడంలో పాఠశాలల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. టైమ్ స్కూల్ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలు మరియు సంస్కారాన్ని అందిస్తుందని తెలిపారు.వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు అందించిన నృత్యాలు, పాటలు, నాటికలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా చిన్నారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుని తల్లిదండ్రులు మరియు అతిథుల ప్రశంసలు దుకున్నాయి.కార్యక్రమం ముగింపు సందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చిన్నారులకు ప్రతీకగా గ్రాడ్యుయేషన్ గౌన్స్ ధరింపజేసి సర్టిఫికెట్లు అందజేసి  వారి భవిష్యత్తు విద్య ప్రయాణం విజయవంతంగా సాగాలని అతిథులు ఆశీర్వదించారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి మండల విద్యాధికారి   ముచెర్ల శ్రీనివాస్,పమార్కెట్  కమిటీ చైర్మన్  చంద్రశేఖర్ రెడ్డి ,  మున్సిపల్ వైస్ చైర్మన్  రాజా రమేష్ గారు సి.ఐ. శ్రీ సతీష్ రెడ్డి ,5వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి శ్రీదేవి కరుణసాగర్ , 9వ వార్డ్ కౌన్సిలర్ శ్రీ చెరుపల్లి ముత్యాలు , టైం స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మందా నరేందర్ రెడ్డి పాలొగొన్నారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -