సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ – పెద్దవూర
రబి సీజన్ ధాన్యం వచ్చిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయాలని, తరుగు తూకంలో మోసాలను అరికట్టి మద్దతు ధర కల్పించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోనీ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రబి సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ, బస్తాల కొరత, లారీలు సకాలంలో రాకపోవడంతో రైతాంగం తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు అగచాట్లు పడుతున్నారని అన్నారు. క్వింటాకు 02 కేజీలు తరుగు తీస్తున్నారని, తూకాలలో కూడా తేడాలు ఉంటున్నాయని తెలిపారు. ఇలాంటి మోసాలను అరికట్టాలని ఈ సందర్బంగా కోరారు. కొనుగోలు కేంద్రాలలో రైతాంగానికి హమాలీలకు మంచినీళ్లు, నీడ, చెట్లు తగిన సౌకర్యాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో రబి సీజన్ లో వరి ధాన్యం బాగా పండిందని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు వస్తున్న రైతాంగానికి సరైన సౌకర్యాలు కల్పించడంలేదని అన్నారు. తరుగు పేరుతో రెండు కేజీలు, తూకాల్లో మోసం జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నందువల్ల ఇలాంటివి జరగకుండా రైతాంగానికి తగిన న్యాయం జరిగే విధంగా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య, దోరేపల్లి మల్లయ్య, తరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES