నవతెలంగాణ పెద్దవంగర: అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని తహశీల్దార్ వీరగంటి మహేందర్, మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని అవుతాపురం, ఉప్పెరగూడెం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడి, కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు అధైర్యపడవద్దని ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలు పంపిస్తున్నాం, వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES