Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భీంగల్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం 

భీంగల్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
ఈరోజు భీంగల్ పట్టణంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. రైతులు పండించిన పంటలు కొనడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మండల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ శివసారి నర్సయ్య తెలిపారు. భీంగల్ మండల కేంద్రంలో రైతు సేవ సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసిల్దార్ షబ్బీర్ చేతులతో లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్‌ శివసారి నర్సయ్య, తాసిల్దార్ మాట్లాడుతూ… రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో రైతులు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి సంవత్సరం భీంగల్ సెంటర్‌ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చూస్తున్నామన్నారు. రైతులకు తమ సహకార సంఘం నుంచి సబ్సిడీ కింద విత్తనాల నుంచి మొదలు పెడితే పండించిన పంటలను కూడా కొనుగోలు చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకే ధాన్యాన్ని కొనగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీసీ రవీందర్, అన్ని పార్టీల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -