Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్ఎలాంటి తరుగు లేకుండా ధాన్యాన్ని ఖరీదు చేయాలి 

ఎలాంటి తరుగు లేకుండా ధాన్యాన్ని ఖరీదు చేయాలి 

- Advertisement -

– పోరిక గోవింద నాయక్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ 
నవతెలంగాణ-గోవిందరావుపేట : తడిసి రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి తరుగు లేకుండా ఖరీదు చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పోరిక గోవింద నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని చల్వాయి గ్రామంలో యాసంగి ధాన్యంతో ఇబ్బందులు పడుతున్న రైతులను టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నరసింహ నాయక్ తో కలిసి గోవింద నాయక్ టిఆర్ఎస్ నాయకులు పరామర్శించి ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా గోవింద నాయక్ మాట్లాడుతూ మండలంలో యాసంగి పంట పొట్ట దశను నుండే ప్రకృతి వైపరీత్యంతో వడగండ్ల వాన తో రైతులు 50 శాతం నష్టపోయారు పంట కోసిన తర్వాత వర్షాలు మరియు సన్నాల వడ్ల కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడింది దీనితో చల్వాయి గ్రామంలోని రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు . ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు  టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రైతులు అధైర్య పడద్దని టిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు  ఎలాంటి తరుగు లేకుండా ప్రభుత్వం వెంటనే వడ్లను కొనుగోలు చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బంది గురికాకుండా చూడాలని టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్యకర్తలు మరియు రైతులు చుక్క గట్టయ్య రేండ్ల శ్రీనివాస్ గూడూరు శ్రీనివాస్ బైక్ అని ఓదేలు గోదా కనకయ్య దూడల రమేష్ కాసర్ల రాజయ్య పెద్దాపురం రవి ఆల్గం సమ్మయ్య మద్దినేని వెంకన్న నల్లెల్ల కృష్ణమూర్తి స్వప్న చెల్పూర్ భాగ్య దూడల సతీష్ కొమ్మురాజుల చిన్ని ఎర్రం కుమార్ మేక కుమార్ చాపల సోమిరెడ్డి పెద్దాపురం ఓదేలు బుల్లి రమేష్ సూరపనేని బోస్ మోటార్ సాంబయ్య చేల దుర్గయ్య ఆల్గం విజయ తాటి సూర్య పాపయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -