రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు
నవతెలంగాణ – తాడ్వాయి
రైతుల ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని గింజ కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వాహకులకు రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని కాటాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని రైతులతో కలిసి పరిశీలించారు. తడిసిన ధాన్య రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షం కారణంగా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, గత 15 రోజులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో వేసినప్పటికీ ఇప్పటికీ ధాన్యం పోకపోవడం బాధాకరం అన్నారు. ప్రభుత్వాలు ఎలాంటి కటింగు లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ, గత సంవత్సరం కింటాకు 6 కేజీల నుండి 8 కేజీల వరకు ధాన్యాన్ని కటింగ్ చేశారని మండిపడ్డారు. రబీ సీజన్లో అయినా రైతులకు ఎలాంటి కటింగులు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు తేమ శాతం అన్ని పరీక్షలు నిర్వహించి టోకెన్ ఇచ్చినాక కూడా ధాన్యం పైన కటింగుల భారం మోపి రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఒక్కో రైతు చాల లక్షల రూపాయల్లో నష్టాల్లో మగ్గుతున్నారని ఆవేదన చెందారు. మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాకులు, అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై కొనుగోలు కేంద్రాల్లో కటింగ్ లేకుండానే ధాన్యం కొనుగోలు చేస్తామని అనుకుంటూనే ఆరు ఏడు కిలోలు కటింగ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆరుగాలం పండించిన రైతుకు న్యాయం జరిగేలా కటింగ్ లేకుండా కొనుగోలు చేసి డబ్బులు వెంటనే వారి అకౌంట్లో డబ్బులు పడే విధంగా చేయాలని ఆయన అన్నారు. ఆయన వెంట రైతులు మద్దూరి రాములు, ముత్తినేని లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ మేడిశెట్టి నరసింహయ్య, బిఆర్ఎస్ యువ నాయకుడు తడక హరీష్, పల్నాటి కృష్ణ, యాకూబ్, సారయ్య తదితర రైతులు పాల్గొన్నారు.
గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES