Monday, March 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంతాపూర్ లో గ్రామసభ

అంతాపూర్ లో గ్రామసభ

- Advertisement -

కారోబార్ నియామకానికి సభ తీర్మానం

నవతెలంగాణ మద్నూర్

మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామంలో సోమవారం నాడు ఆ గ్రామ సర్పంచ్ పార్వతీ బాయి అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఈ గ్రామ సభలో ముఖ్యంగా పంచాయతీ కారోబార్ నియామకంపై తీర్మానం చేసినట్టు గ్రామ కార్యదర్శి తెలిపారు. అదేవిధంగా గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామస్తులు సభా దృష్టికి తీసుకువచ్చినట్టు కార్యదర్శి తెలియజేశారు. ఈ గ్రామ సభలో ఉప సర్పంచ్ సంగీత, వార్డ్ సభ్యులు, అంగన్వాడి, ఆశా వర్కర్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -