Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీరామనవమి సందర్భంగా మథురతాండాలో ఘనంగా వేడుకలు

శ్రీరామనవమి సందర్భంగా మథురతాండాలో ఘనంగా వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని మథుర తాండా లో శ్రీరామనవమి సందర్భంగా వేడుకలను గ్రామ సర్పంచ్ అనిత మోహన్ చౌహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సేవలాల్ మందిరం నుండి ర్యాలీగా వెళ్లి సేవాలాల్ జెండాను ఉప సర్పంచ్ తో కలిసి గ్రామస్తులు ఎగురవేయడం జరిగింది. కార్యక్రమంలో శ్రీరామనవమి సందర్భంగా  మహా అన్నదానం ఏర్పాటు చేశారు. గ్రామంలో శ్రీరామనవమి రోజుసేవాలాల్  జెండాను ప్రతి ఏటా ఎగుర వేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్,  గ్రామ  ప్రజలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజ చేయడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -