Tuesday, May 20, 2025
Homeఖమ్మంవృద్ధాశ్రమంలో మనవరాలి పుట్టిన రోజు…

వృద్ధాశ్రమంలో మనవరాలి పుట్టిన రోజు…

- Advertisement -
  • – వృద్దులకు దుస్తులు,పండ్లు పంపిణీ చేసిన తాత…
    నవతెలంగాణ – అశ్వారావుపేట
  • బాల్యం నుండే పిల్లలకు సేవా గుణం అబ్బాలనో,లేక నలుగురు నిరాశ్రయులుకు ఉడుతా భక్తి సహాయం మో… ఏదైతే నేమి తన మనవరాలి పుట్టిన రోజు ను వృద్ధాశ్రమంలో నిర్వహించాడు ఓ తాత. స్థానిక టీఆర్ఎస్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు  సోమవారం పట్టణంలోని అమ్మా సేవా సదన్ వృద్ధాశ్రమంలో తన మనవరాలు హిమబిందు జన్మదినం సందర్భంగా వృద్ధులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు.లక్షలాది వ్యయంతో పుట్టిన రోజు చేసినా రాని ఆత్మసంతృప్తి ఆశ్రమంలో వృద్ధుల మధ్య జరుపుకుంటే వస్తుందని ఆయన అన్నారు. ఈ విధంగా వృద్ధాశ్రమంలో వేడుకలు జరుపుకుంటే ఒకరోజు వారి ఆకలి బాధను తీర్చటమే కాకుండా వారి ఆశీస్సులను పొందటం ఆనందంగా ఉందన్నారు.  ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు  తిరుమల శెట్టి అప్పారావు,వలీ పాషా,పాశం రామారావు,తోకల హరీష్ గుప్తా,నాగబాబు నాయుడు,రాజేష్, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -