Tuesday, November 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబూడిద మేఘాలు..పలు విమానాల రద్దు

బూడిద మేఘాలు..పలు విమానాల రద్దు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: ఇథియోఫియాలో బద్ధలైన భారీ అగ్నిపర్వతం బూడిద, దుమ్ము కణాలు వాయువ్య భారతాన్ని చేరాయి. దీంతో ఆకాశమార్గంలో పెద్దఎత్తున పొగవ్యాపించి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో కేంద్ర విమానయాన శాఖ వెంటనే అప్రమత్తమైంది. ఆ మార్గంలో ప్రయాణించే కొన్ని విమానాలను రద్దు చేసింది. ఇథియోఫియాలోని హైలీ అగ్నిపర్వతం భారీ విస్పోటనం చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆ అగ్నిప్రమాదం విస్పోటనం ప్రభావం ఇప్పుడు భారత్ పై పడింది.
నిన్న సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో గాలిలో బూడిద అంతా అల్లుకొని గాలిలో పొగమేగంలా భారత్ లో వ్యాపించింది. భూతలం నుంచి 10 కిలోమీటర్లకు పైగా ఎత్తులో దాదాపు 100-120 కి.మీ వేగంతో ప్రయాణించిన ఈ దుమ్ము,దూళి కణాలు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ పంజాబ్ ల మీదుగా ప్రయాణించడంతో ఆకాశంలో  విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో 6 విమానాలను రద్దు చేసింది. అకారా ఎయిర్ లైన్స్ జెడ్డా, కువైట్, అబుదాబీలకు ప్లైట్ సేవలను రద్దు చేసింది. డీజీసీఏ అగ్రిపర్వత బూడిద హెచ్చరికలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ అగ్నిపర్వత బూడిద ఎఫెక్ట్ భూ ఉపరితలాన్ని ప్రభావితం చేసే అవకాశాలు లేవని ఐఏండీ అధికారులు తెలిపారు. అగ్నిపర్వత బూడిద 10-15 కిలోమీటర్ల ఎత్తున వెళుతున్నందున్న గాలి నాణ్యతకు అధిక హాని ఏర్పడే అవకాశాలు లేవన్నారు. అయితే ఉష్ణోగ్రతలు క్షీణించి ఆకాశం మబ్బుగా ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -