హీరో నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్ : ది థర్డ్ కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. పాన్ ఇండియాగా నేడు (గురువారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నాని మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.
టీజర్, ట్రైలర్‌లో చాలా వైలెన్స్ కనిపిస్తుందనే కామెంట్స్ వచ్చాయి. అయితే ‘హిట్’ ఫ్రాంచైజీ లో వచ్చిన రెండు సినిమాలు కూడా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్. దీనికి వచ్చేసరికి యాక్షన్ వైలెన్స్‌ని కథ డిమాండ్ చేసింది. ఇది రెగ్యులర్ సినిమాల ఉండదు. చాలా రిలేటబుల్, స్టైలిష్ గా ఉంటుంది. ఆర్గానిక్‌గా కుదిరిన కొన్ని ఎలిమెంట్స్ వల్ల సినిమాలో చూస్తున్నప్పుడే విజల్ వర్తీ మూమెంట్స్ చాలా ఉంటాయి . ఈ సినిమాని వైలెన్స్ కోసం తీయలేదు. కథలో ఆర్గానిక్ గా వైలెన్స్ ఉంది. అది సినిమా చూస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది.
అడ్వాన్స్ బుకింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ జోనర్ సినిమా. టార్గెట్ ఆడియన్స్‌ని మెప్పిస్తే ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా టార్గెట్ ఆడియన్‌ని ఖచ్చితంగా మెప్పిస్తుంది.
షాన్ వర్గీస్ అద్భుతమైన కెమెరామెన్. ఆయన విజువల్‌తో ఒక స్టోరీ చెప్పాలని ప్రయత్నిస్తారు. ఆయన పెట్టే ప్రతి ఫ్రేమ్ వెనక ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. ఆయన ఒక షాట్ పెడితే అది ఆడియన్స్‌ని ఏం ఫీలయ్యాలా చేస్తుందో అనే క్లారిటీతోనే పెడతారు. ఆయన విజువల్స్ ఎమోషన్‌ని ఎన్హాన్స్ చేస్తాయి. ఈ సినిమాకి వెరీ ఇంపాక్ట్ ఫుల్ కెమెరా వర్క్ ఇచ్చారు.
మిక్కి జే మేయర్ మంచి క్రాఫ్ట్ మ్యాన్ .ఇప్పటివరకు మంచి ఫీల్ గుడ్ సినిమాలు చేశారు. ఆయన ఎప్పుడు కూడా థ్రిల్లర్ చేయలేదు. ఆయన ఒకవేళ థ్రిల్లర్ చేస్తే ఆ సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఆయన్ని తీసుకోవడం జరిగింది. ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆడియన్స్‌కి ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
ఈ సినిమాలో కొంత భాగం పహల్గమ్‌లోని డిఫరెంట్ లోకేషన్స్‌లో 18 రోజులు షఉట్ చేశాం. మొన్న జరిగిన ఘటన మమ్మల్ని కలిచివేసింది.
హీరోయిన్ శ్రీనిధి శెట్టి మంచి నటి.
ఈ సినిమాలో ప్రతి పాత్రకి ఒక పర్పస్ ఉంటుంది . శ్రీనిధి చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడే ఎక్కువ విషయాలు రివీల్ చేయకూడదు. తనకి ఆడియన్స్‌లో చాలా మంచి క్రేజ్ ఉంది. తను ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది.
రాజమౌళి అంటే నాకు ఒక ఫ్యామిలీ మెంబర్. ఈవెంట్‌కి మిస్ అవ్వకూడదని ఎంత బిజీలో ఉన్న ఆయన రావడం మాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. మూడు సినిమాలకి చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. నెక్స్ట్ వచ్చే సినిమాకి ఆయన చీఫ్ గెస్ట్‌గా రాకపోతే ఎలా అనే టెన్షను మొదలైంది(నవ్వుతూ).
డైరెక్టర్ శైలేష్ ఇలాంటి ఇంటెన్స్ యాక్షన్ సినిమాలు తీస్తున్నాడు. కానీ తను చాలా సెన్సాఫ్ హ్యూమన్ ఉన్న మనిషి. మాటల్లోనే జోకులు పేలిపోతుంటాయి. తనకి ఒక మంచి కామెడీ స్క్రిప్ట్ రాయమని చెప్తుంటాను. తను కామెడీ రాస్తే చాలా బ్రహ్మాండంగా వుంటుంది.
‘పారడైజ్’ లో వైలెన్స్ హిట్ 3కి మించి ఉంటుందా అంటే, ఈ రెండు దేనికవే ప్రత్యేకమైన సినిమాలు. పారడైజ్ ఒక ఎపిక్ స్కేల్ లో ఉంటుంది. హిట్ 3 ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.
చిరంజీవి అభిమాని అయిన నేను ఆయనతో సినిమా నిర్మించడం అనేది నాకు ఇంకా డైజెస్ట్ కావడం లేదు. (నవ్వుతూ) ఇదొక ప్రౌడ్ మూమెంట్.
గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా
- Advertisement -
RELATED ARTICLES