– పాలసీబజార్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ పవిత్ లౌల్
నవతెలంగాణ హైదరాబాద్: స్మార్ట్ పెట్టుబడితో అధికంగా సంపదను సృష్టించవచ్చని పాలసీబజార్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ పవిత్ లౌల్ తెలిపారు. చాలా మంది భారతీయులకు పెట్టుబడులు అంటే కేవలం డబ్బు పెరగడం మాత్రమే కాదని, జీవిత లక్ష్యాలను సాధించడానికి భరోసా కల్పించడం కూడా అన్నారు. అవి రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లల విద్య, భవిష్యత్తుకు భద్రత అన్నారు. ప్రతి పెట్టుబడికి ఒక దీర్ఘకాలిక స్వప్నం ఉంటుందన్నారు. ఇది షేర్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో? తగ్గుతుందో? అంచనా వేసే విషయం కాదన్నారు. అనేక ఏళ్లు నిరంతరం పెట్టుబడి పెట్టడంలోనే ఉంటుందన్నారు. ఈ రోజుల్లో పెట్టుబడి ప్రపంచం వేగంగా మారిపోతుందన్నారు. ఈ సమయంలో నూతన తరం యూఎల్ఐపీ (యూనిట్ లింక్డ్ ఇన్షూరెన్స్ ప్లాన్స్) ఒక ఆశాదీపం అన్నారు.
పారదర్శకత, తక్కువ ఖర్చు, పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాల పెట్టుబడి క్రమశిక్షణ ఇవన్నీ ఒకేచోట కలిపి లభిస్తాయన్నారు. ఇవి కేవలం రాబడి ఇవ్వడం మాత్రమే కాకుండా, జీవన రక్షణ, కాంపౌండింగ్ శక్తి ద్వారా వ్యక్తి జీవిత లక్ష్యాలను ధైర్యంగా చేరుకునేలా సహాయపడుతాయని తెలిపారు. తక్కువ చార్జీలు, పరిపక్వత సమయంలో పన్ను మాఫీ వంటి ప్రయోజనాలతో యూఎల్ఐపీ కేవలం ఇన్సూరెన్స్ ఉత్పత్తులు మాత్రమే కావన్నారు.
ఇప్పుడు యూనిట్ లింక్డ్ ఇన్షూరెన్స్ ప్లాన్స్ కు మళ్లీ ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఎందుకంటే, ఇవి నిజమైన సంపదను సృష్టించడంలో ఒక అలవాటును ప్రోత్సహిస్తాయన్నారు. దీర్ఘకాలం, నిరంతరం పెట్టుబడి పెట్టడాన్ని ఒకప్పుడు ఖరీదైన పెట్టుబడి అని విమర్శించే వారన్నారు. కానీ ఈరోజుల్లో ఇవి పారదర్శకంగా, తక్కువ ఖర్చుతో, పన్ను ప్రయోజనాలతో కూడిన ఆర్థిక ఉత్పత్తులుగా అభివృద్ధి చెందాయన్నారు. మార్కెట్‌కు అనుసంధానమైన పెట్టుబడులు ఉత్తమమన్నారు. ఉదాహరణకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల పైగా లాభాలపై 12.5 శాతం దీర్ఘకాలిక మూలధన లాభ పన్నుకు లోబడి ఉంటాయన్నారు. సెక్షన్ 10(10డీ) ప్రకారం.. ఏటా చెల్లించే ప్రీమియం రూ.2.5 లక్షలలోపు ఉంటే, సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజ్) ప్రీమియం కంటే కనీసం 10 రెట్లు ఉంటే, అప్పుడు దీని మెచ్యూరిటీ అమౌంట్ పూర్తి పన్ను మాఫీ అవుతుందన్నారు.
దీర్ఘకాలంలో పెట్టుబడి, జీవన భద్రత, పన్ను మినహాయింపు అనే మూడు ప్రధాన ప్రయోజనాలు ఒకే ఉత్పత్తిలో కలవన్నారు. దీర్ఘకాలం చూస్తే ఈ ప్రయోజనం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఉదాహరణకు నెలకు రూ.10,000 చొప్పున పదేళ్లు పెట్టుబడి పెడితే మొత్తం 20 సంవత్సరాలు పెట్టుబడి కొనసాగించిన పెట్టుబడిదారుల మార్కెట్ రాబడి 15 శాతం వచ్చిన సందర్భంలో యూఎల్ఐపీ ద్వారా సుమారు రూ.85 నుంచి 86 లక్షల వరకు పొందవచ్చన్నారు. అదే పెట్టుబడిని ప్రత్యక్ష మ్యూచువల్ ఫండ్‌లో పెట్టినట్లయితే, పన్ను ముందు సుమారు రూ.95 లక్షలు రావచ్చన్నారు. అయితే, లాభాలపై ఎల్టీసీజీ (దీర్ఘకాలిక మూలధన లాభ పన్ను) చెల్లించిన తర్వాత చేతిలో మిగిలేది సుమారు రూ.84 లక్షల మాత్రమేనన్నారు.ఖర్చులు ఎక్కువగా ఉండే సాధారణ మ్యూచువల్ ఫండ్లలో అయితే, పన్ను తరవాత మిగిలే మొత్తం ఇంకా రూ.10 నుంచి 12 లక్షలు తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు.
దీర్ఘకాల పెట్టుబడిదారులు సరైన యూఎల్ఐపీ ఎంచుకుంటే, పన్ను తర్వాత లాభాలు మ్యూచువల్ ఫండ్లతో సమానంగా లేదా ఇంకా ఎక్కువగా ఉండవచ్చన్నారు. అదనంగా వచ్చే 10 నుంచి 20 సంవత్సరాల తర్వాత ఎల్టీసీజీ పన్ను రేట్లు పెరగడం కూడా సాధ్యమేనన్నారు. అప్పుడు ఈ లాభాల్లో అంతరం ఇంకా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ యూఎల్ఐపీ మార్పు క్రమబద్ధమైన నియంత్రణ సంస్కరణలు, డిజిటల్ పంపిణీ వ్యవస్థ పెరుగుదల వల్ల వచ్చిందన్నారు. దశాబ్దం క్రితం వరకు యూఎల్ఐపీపై సంవత్సరానికి 5 నుంచి 6 శాతం వరకు భారీ ఛార్జీలు ఉండేవన్నారు. ఇప్పుడు లేవన్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ యూఎల్ఐపీలో ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీలు (ఏఫ్ఎంసీ) సుమారు 1.25 శాతం నుంచి 1.35 శాతం మధ్యలో ఉన్నాయన్నారు. ఇవి సాధారణ మ్యూచువల్ ఫండ్లలో ఉండే 1.2 శాతం ఖర్చులకు దాదాపు సమానమన్నారు. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లు వసూలు చేసే 0.5 శాతం ఖర్చులతో పోలిస్తే యూఎల్ఐపీ కొంచెం అధికమే అయినా, పన్ను ప్రయోజనాల దృష్ట్యా ఇవి మొత్తం లాభం పరంగా మెరుగ్గా ఉన్నాయన్నారు.
స్వల్ప కాల మార్కెట్ ఊహాగానాలు, అప్రయోజనకర నిర్ణయాలు, భావోద్వేగ అమ్మకాలకు లోనయ్యే కాలంలో యూఎల్ఐపీ మార్కెట్‌ను అంచనా వేసి పెట్టుబడి పెట్టడంపై కాకుండా, పెట్టుబడి కాలంపై దృష్టి పెడతాయన్నారు. ‘ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి?’ అనే ప్రశ్న నుంచి ‘ఎంత కాలం పెట్టుబడి కొనసాగించాలి?’ అనే ఆలోచన వైపు మళ్లిస్తాయన్నారు. స్థిరమైన పెట్టుబడి అలవాటును ఏర్పరుస్తుందన్నారు. అకస్మాత్తుగా తీసుకునే నిర్ణయాలను తగ్గిస్తుందన్నారు. కాంపౌండింగ్ శక్తి అడ్డంకులు లేకుండా పని చేయడానికి అవకాశం ఇస్తుందన్నారు. కాంపౌండింగ్ శక్తి అడ్డంకులు లేకుండా పని చేయడానికి సహాయపడుతుందని తెలిపారు. ఈ కాలక్రమంలో ఈ అలవాటు సడన్‌గా కొంచెం కొంచెం సేవ్ చేసే వారిని,
నిజంగా సంపదను నిర్మించుకునే వారిని
స్పష్టంగా వేరు చేస్తుందన్నారు. మ్యూచువల్ ఫండ్ల వంటి ఇతర మార్కెట్ పెట్టుబడుల్లో పెట్టుబడిదారులలో చాలా తక్కువ శాతం మాత్రమే ఐదేళ్లకు మించి పెట్టుబడి కొనసాగిస్తారని తెలిపారు. కానీ యూఎల్ఐపీ మాత్రం దీర్ఘకాల పెట్టుబడి క్రమశిక్షణను సహజంగానే పెంచుతాయన్నారు. దీంతో కాంపౌండింగ్ ప్రభావం అత్యుత్తమంగా పని చేస్తుందన్నారు. దీర్ఘకాలంలో ఎక్కువ సంపద ఏర్పడుతుందని తెలిపారు. లాభాలు మాత్రమే కాదని, యూఎల్ఐపీ ముఖ్యమైన రక్షణ పొరను కూడా అందిస్తాయన్నారు.
ఈ రోజుకి కూడా నిలుస్తోందన్నారు. ఈ రోజుల్లో పెట్టుబడిదారులు, ముఖ్యంగా యువత, పన్నుల గురించి అవగాహనతో లక్ష్యాలపై కేంద్రీకృత దృక్పథంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు.



