కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ ఓ యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తోంది. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. ఈ చిత్రానికి ‘జిగ్రీస్’ అనే క్రేజీ టైటిల్ ఖరారు చేశారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా టైటిల్, ఫస్ట్ లుక్‌ని లాంచ్ చేసి టీంకి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఒక వింటేజ్ మారుతీ 800 కారు పక్కన నిలబడ్డ నలుగురు ఫ్రెండ్స్‌ని పై నుంచి చూపించడం ఆసక్తికరంగా ఉంది. బోల్డ్ ఆరెంజ్ బ్యాక్‌డ్రాప్, గ్రిట్టీ టైటిల్ టైపోగ్రఫీ… సినిమా ఎంత అడ్వెంచరస్‌గా ఉండబోతోందో తెలియజేస్తోంది. ఈ ఫస్ట్ లుక్, టైటిల్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. చైల్డ్‌హుడ్ ఫ్రెండ్షిప్, నాస్టాల్జియా, క్రేజీ అడ్వెంచర్స్, హిలేరియస్ రోడ్ ట్రిప్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. ‘ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. వారి టేస్ట్‌కి తగ్గట్టు, ప్రజెంట్ ట్రెండ్‌కి తగ్గట్టు ఉన్న కథలను బాగా ఆదరిస్తు న్నారు. ఆ కోవలోనే మా ‘జీగ్రీస్’ చిత్రం ఉంటుంది. ఇందులోని ప్రతి అంశం మన లైఫ్‌లో ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతూనే ఉంటుంది. ఇదొక యూనివర్సల్ కాన్సెప్ట్. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని స్తుందని కచ్చితంగా చెప్పగలం. ఈ సినిమా సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి డీవోపీ: ఈశ్వరాదిత్య ఎడిటర్: చాణక్య రెడ్డి, సంగీతం: కమ్రాన్.